News & Views

చర్చ,రామగుండం: ఎన్నికల విధుల్లో మానవత్వం చాటిన పోలీసులు..

 

  • ఓటు వేసేందుకు వచ్చిన వృద్దులు, వికలాంగులకు సహాయం..
  • మానవత్వం చాటిన పోలీసులకు అధికారుల ప్రశంసలు…

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలీసులు మానవత్వం చాటారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు,వికలాంగులకు సహాయం చేసి ఓటు వేసేందుకు సహకరించారు. అందుగులపేట స్కూల్ లో ఏ ఎస్ ఐ మల్లేష్, తుర్కపల్లి గ్రామం లో జె విశ్వనాథ్,కోటపల్లి మండలం సిర్స గ్రామంలో లో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ నీతిన్ లు పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి వృద్ధులు ,వికలాంగులు ఓటు వేసేందుకు సహాయపడ్డారు. ఖాకీల మానవీతను స్థానిక ప్రజలు అభినందించారు. డ్యూటీతో పాటు మానవత్వాన్ని చాటిన పలువురు పోలీస్ సిబ్బందిని అదికారులు ప్రశంసించారు.