చర్చ, సత్తుపల్లి: సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో బందోబస్త్ పర్యవేక్షించిన కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్…

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో బుధవారం సత్తుపల్లి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు.
తంబుర్ గ్రామంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికల సందర్బంగా అనంతరం జరిగే
ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ప్రతిఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులు, స్థానిక ప్రజలకు,రాజకీయ నాయకులు సహకారం అందించాలన్నారు.
సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉన్నందున ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధన అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.