News & Views

చర్చ, పెద్దపల్లి: ఓటర్లను ఆకట్టుకునేలా గ్రీన్ పోలింగ్ కేంద్రాలు..

 

 

  • పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి,ఏసిపి మడత రమేష్..

 

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు పోలీంగ్ కేంద్రాల వినూత్న ఏర్పాటు చేశారు .పెద్దపెల్లి జిల్లా కొలనూరు పోలింగ్ కేంద్రంలో పచ్చని పర్యావరణ వాతావరణం ఏర్పరచి గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రం వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు . కొబ్బరి తోరణాలు, పూల అలంకరణ,పచ్చని మొక్కలు ,ప్లాస్టిక్ రహిత సామాగ్రి,పర్యావరణ హిత అలంకరణ,సెల్పీ పాయింట్లు,ఆహ్లాదకరమైన మధురానుభూతిని ఓటర్లకు కల్పించే విదంగా ఏర్పాటు చేశారు .గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి ,ఏసిపి మడత రమేష్ సందర్శించారు . పచ్చని తోరణాలతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా డిసిపి రామ్ రెడ్డి మాట్లాడుతూ తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పోత్కపల్లి ఎస్ ఐ దీకొండ రమేష్, తదితరులు ఉన్నారు.