చర్చ, ఖమ్మం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నూతన సర్పంచులు

- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగిలేటి
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం ఖమ్మంలో క్యాంపు కార్యాలయం నందు వైరా మండలంలో నూతనంగా ఎంపికైన సర్పంచులు తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫైడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్ తో కలిసి మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు .ఈ కార్యక్రమంలో తాటిపూడి సర్పంచ్ జవ్వాజి అశ్విని నాగరాజు ,విపాలమడక సర్పంచ్ మేడ హేమ చక్రపాణి సంపత్ ,కోష్టాల సర్పంచ్ మంచాల విజయలక్ష్మి, స్టేజి పినపాక సర్పంచ్ తన్నీరు కృష్ణారావు, ముసలమడుగు సర్పంచ్ తరడకమాల నాగార్జున్, కొండకుడిమ సర్పంచ్ జెర్రిపోతుల వినోద్ కుమార్ ,ఖానాపురం సర్పంచ్ భూక్య బాలాజీ ,వల్లపురం సర్పంచ్ మన్నెం హనుమంతరావు, పాలడుగు సర్పంచ్ గద్దల నరసింహారావు , లింగన్నపాలెం సర్పంచ్ చెంగాల పరశురాం మంత్రి పొంగలిడి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైరా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోళ్ళ గంగారావు, ధర్నా రాజశేఖర్ ,మిట్టపల్లి నాగి, నర్వినేని అశోక్, కొరివి నరసింహారావు, చింతనిపు శ్రీను, జవ్వాజి నాగరాజు, పొట్టపల్లి శ్రీను ,వేల్పుల రామారావు ,శీలం శ్రీనివాసరెడ్డి, ఈలప్రోలు వెంకటప్పయ్య ,షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు