News & Views

చర్చ, జగిత్యాల : ప్రశ్నించే గొంతుకలను కేంద్రం అణచి వేస్తోంది

 

  • ఢిల్లీ హైకోర్టు తీర్పు మోడీ, అమిత్షాలకు చెంప పెట్టు
  • జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ

చర్చ, జగిత్యాల : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈ డి దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకోకపోవడం స్వాగత్తిస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షులు నందయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జీవన్ రెడ్డి ఇంటి నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ, అమిత్ షా కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొని ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తోందన్నారు. వేధింపుల రాజకీయాలు మానుకొని ప్రజా సంక్షేమముపై దృష్టి సారించాలని సూచించారు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాధన ఉపసంహారించుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు