News & Views

చర్చ, రామగిరి: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ శిక్షణ శిబిరo – సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య

రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్ సింగరేణి సంస్థ రామగుండం – 3 జి ఎం నరేంద్ర సుధాకర్ రావు సహకారంతో రాజాపూర్ గ్రామ మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మహిళలు సర్పంచ్ , ఉపసర్పంచ్ మరియు రాజాపూర్ పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సందర్భంగా సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని ఇది ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో మరిన్ని మంచి పనులతో గ్రామాన్నీ అభివృద్ధి పథంలో దూసుకుకపోయేలా కార్యక్రమాలు నిర్వహిస్తానని వారు సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్, వార్డ్ సభ్యులు కాల్వ రజిత శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటేటి రవి, మాటేటి శ్రీనివాస్,మాజీ వార్డ్ సభ్యులు నరహరి సంతోష్, కాల్వ మహేష్ మరియు రాజాపూర్ గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.