చర్చ,పెద్దపల్లి: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతీ రేషన్ కార్డుదారు తన యొక్క వేలిముద్ర సహాయంతో 100% E-KYC పూర్తి చేసుకోవాలని , జిల్లాలో ఇప్పటివరకు 76.29% మాత్రమే పూర్తి చేసుకున్నారని, మిగిలిన (1,68,272) రేషన్ కార్డు లబ్దిదారులు, (5) సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్నవారు వారియొక్క నివాస సమీపంలో అందుబాటులో వున్న రేషన్ షాపునకు వెళ్ళి తమ యొక్క e-KYC తప్పక పూర్తిచేసుకోవలని అన్నారు.
5 సంవత్సరాల వయసు పూర్తి కాని పిల్లలకు e-KYC నుండి మినహాయింపు ఇవ్వడమైనది. FP షాపు డీలర్లు కూడా వారియొక్క రేషన్ షాపులను తెరచివుంచి e-KYC పూర్తిచేయుటకు సహకరించలని,రేషన్ షాపులయందు ఈ విషయంలో కార్డు దారులతో సహకరించి, e-KYC పూర్తి చేయాలని, ఈ విషయంలో వారు వారి షాపునందు ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.