చర్చ,గోదావరిఖని: బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కేలా కృషి చేయండి.
పెద్దపల్లి ఎంపి వంశీ ని కోరిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్.
తెలంగాణ లో ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఐన సింగరేణి ని తెలంగాణ బిజెపి కి చెందిన పార్లమెంటు సభ్యులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను, సింగరేణి కార్మికులను అవమానపరుస్తున్నారని అన్నారు. వెంటనే తెలంగాణకు చెందిన బిజేపి ఎంపి లు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి సింగరేణి యాజమాన్యం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్తించిన బొగ్గు బ్లాక్ లను సింగరేణి కి దక్కె విధంగా చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు ఎంఎండిఆర్ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలు దక్కించుకోవడం వల్ల కార్మికులు, ఉద్యోగులు మరియు దీని పై ఆధారపడి జీవిస్తున్న వేల మంది కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారని, నిరుద్యోగుల కు ఉపాధి అవకాశాలు రావని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా సామాజికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కనుక తెలంగాణ లో ఉన్న బిజెపి ఎంపి లు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి ఎంఎండిఆర్( మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యలేషన్ యాక్ట్) చట్టం సెక్షన్ 17 కింద సింగరేణి కి బొగ్గు గనుల ను కేటాయించి తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పెద్దపల్లి ఎంపి వంశీ క్రిష్ణ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి తెలంగాణా లో ఉన్న బొగ్గు బ్లాక్ లను సింగరేణి కి దక్కె విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇట్టి విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి సింగరేణి కి బొగ్గు గనులు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిచో అన్ని ప్రజా సంఘాల ను కలుపుకొని బిజేపి ఎం పి ల ఇండ్లను ముట్టడి కార్యక్రమం కు పిలుపు నిస్తామని ఆయన హెచ్చరించారు.