News & Views

చర్చ, జగిత్యాల: జగిత్యాల జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ శ్రీనివాస్

జిల్లా నూతన వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ కె ప్రమోద్ కుమార్ డిప్యూటేషన్ పై పెద్దపెల్లి జిల్లాకు వెళ్ళారు. కొత్తగా భాద్యత లను చేపట్టిన డా. శ్రీనివాస్ ను వైద్య సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాన్నీ అందించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ఏ ఏం ఓ సత్యనారాయణ, ఎన్ హెచ్ ఎం, డి పి ఓ రవీందర్, హెచ్ ఈ ఓ లు రామ్ కుమార్ ,శ్రీధర్, రాజేశం, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటకం భూమేశ్వర్, తరాల శంకర్, సూపర్వైజర్లు శ్రీనివాస్, శ్యామ్, మురళి ,తదితరులున్నారు