చర్చ,గోదావరిఖని: ‘గోపా’ స్వర్ణోత్సవ సభ విజయవంతం చేయాలి. జిల్లా ప్రెసిడెంట్ మండ రమేష్ గౌడ్ పిలుపు
గౌడ అఫిషియల్స్,ప్రోఫెషనల్ (గోపా) స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గోప పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ మండ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనే ద్యేయంగా గౌడ బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే గోపా ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.గత ఐదు దశాబ్దాలుగా విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ హైదరాబాద్ వంటి నగరాల్లో ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తూ వారి ఉన్నత చదువులకు బాసటగా నిలుస్తోందని అన్నారు.ఈ క్రమంలో హైదరాబాద్లో జరగబోయే భారీ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా నుంచి కుల బాంధవులు, విద్యావంతులు,వృత్తి నిపుణులు భారీ సంఖ్యలో హజరై స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గోప ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్,కోశాధికారి దేవేందర్ గౌడ్,నాయకులు మాచిడి మహేందర్ గౌడ్,చంద్రయ్య,ఎల్లా గౌడ్,బాలసాని స్వామి గౌడ్,తదితరులు పాల్గొన్నారు.