చర్చ, సత్తుపల్లి: కిష్టారం ఉప సర్పంచ్ గా శీలం నాగరాణి ఏకగ్రీవ ఎన్నిక.

స్థానిక ఎన్నికలలో ప్రభంజనం సృష్టించి సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో అత్యధిక ఓట్ల మెజారిటీతో కిష్టారం గ్రామ సర్పంచ్ గా నరుకుళ్ళ రాజేశ్వరి అప్పారావు గెలుపొందిన విషయం విధితమే. గ్రామంలో సర్పంచ్ ఎన్నికతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కీలక కావడంతో ఉప సర్పంచ్ ఎన్నిక గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికలో నరుకుళ్ళ రాజేశ్వరి ప్యానెల్ లో 7వ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికైన శీలం.నాగరాణి ని గ్రామంలోని 12 వార్డులకు గాను ఏడుగురు మెజార్టీ వార్డు మెంబర్లు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నాగరాణి మాట్లాడుతూ అతి చిన్న వయసులో గ్రామానికి సేవ చేసే గౌరవప్రదమైన పదవి పొందడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, గ్రామ సర్పంచ్ నరుకుళ్ళ రాజేశ్వరి అప్పారావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరుకుళ్ళ అప్పారావు, నరకుళ్ళ రవి, గుడ్లూరి రవి, మారోజు నాగేశ్వరరావు, మారోజు శ్రీను, 2వ వార్డు మెంబర్ చెట్టిమాల. ప్రమీల, 4వ వార్డు మెంబర్ పత్తిపాటి.అశోక్,6వ వార్డు మెంబర్ ఓడి.భవాని,8వ వార్డు మెంబర్ జువ్వాల. శ్రీనివాసరావు,9వ వార్డ్ మెంబర్ సురటి. వెంకటరమణ,11వ వార్డ్ మెంబర్ పాలకుర్తి. సునీల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.