News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: ఆరుగురు మట్కా జూదరులను అరెస్టు చేసిన కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు

విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం మూడో పట్టణ పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో మట్కా ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.కొత్తగూడెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్ వెనుకవైపు గల కూలీలైన్లో ఈ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మూడో పటాన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వీరి వద్ద నుండి 14,170/- రూపాయల నగదున, 06 మొబైల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తుల వివరాలు
1). ఊమ్మళ్ల దుర్గాప్రసాద్ s/o లక్ష్మి నారాయణ, 32 సం,బిజినెస్, R/o.కూలీ లైన్, కొత్తగూడెం.
2). రాచర్ల రాజు S/O. లేటు రాజయ్య,36 సంవత్సరాలు,ఇస్త్రీ పని, R/o.లెనిన్ నగర్ మేదరబస్తి కొత్తగూడెం,
3) ఇందారపు పవన్ కుమార్ s/o శ్రీనివాస్, 27 సం,కూలి, R/o.కూలీ లైన్, కొత్తగూడెం.
4).మేకతోటి విజయకుమార్ s/o.రాజు, 32 సంవత్సరాలు,కూలి, R/o.కూలీ లైన్,కొత్తగూడెం.
5) మనబోతుల రామ్ కుమార్ s/o.కోటి లింగం, 70 సంవత్సరాలు,రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి, R/o.హనుమన్ బస్తి,కొత్తగూడెం.
6) వాగబోయిన రాము s/o.భద్రయ్య, 54 సంవత్సరాలు,కూలీ, R/o.ప్యూన్ బస్తి,కొత్తగూడెం.
ఎవరైనా మట్కా, బెట్టింగ్, పేకాట, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సూచనలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వెల్లడించారు.