News & Views

చర్చ, కొత్తగూడెం లీగల్ సెల్: అత్యధిక కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

  • జాతీయ లోక్ అదాలత్ పై కోర్ట్ కానిస్టేబుల్స్ తో సమీక్ష సమావేశం

డిసెంబర్ 21వ తారీకున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని ఎస్ యూ కే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీటింగ్ హాలులో కోర్ట్ కానిస్టేబుల్స్ లతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు. రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు మరియు ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రాజమల్లు, కోర్టు కానిస్టేబుల్స్, రామిశెట్టి రమేష్ పాల్గొన్నారు.