చర్చ,రామగిరి: పురిగిరి క్షత్రియ పెరిక రాష్ట్ర కార్యవర్గo లో నరెడ్ల శ్రీనివాస్ బత్తుల రమేష్
పురిగిరి క్షత్రియ పెరిక కుల రాష్ట్ర కార్యవర్గంలో రామగిరి మండలానికి అధిక ప్రాధాన్యత లభించింది. మండలానికి గత 15 సంవత్సరాలుగా పురిగి క్షత్రియ పెరిక సంఘానికి చేసిన సేవలకు గుర్తించి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘము రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రామగిరి మండలం సేంటినరీ కాలనీకి చెందిన బత్తుల రమేష్, నరెడ్ల శ్రీనివాస్ లను శుక్రవారం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లక్కరుసు ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షులు యర్రం శెట్టి ముత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రం అందజేయడం జరిగింది. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల అభివృద్ధికి విశేష కృషి చేస్తానని బత్తుల రమేష్, నారెడ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన శ్రీనివాస్ రమేష్ లను రామగిరి మండల క్షత్రియ పెరిక కుల సంఘ అధ్యక్షులు ఉగ్గే కుమార్, ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, కోశాధికారి కందుల సదయ సభ్యులు బుద్ధి ఉదయ్, దుండి రాజేందర్ , కోటే భీమయ్య సందేలా కుమార్, చింతం మహేందర్ శుభాకాంక్షలు తెలిపారు.