చర్చ:రామగిరి: ప్రశాంతంగా ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అర్జీ త్రి జి ఎం నరేంద్ర సుధాకర్ రావు
శుక్రవారం రామగుండం కోల్ మైన్ పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జెఎన్టిహెచ్ (మంథని) కళాశాల క్రీడా ప్రాంగణం నందు నిర్వహించడం జరిగింది.
కార్యమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, IAS పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి భిక్షపతి అధ్యక్షత వహించారు.
మంథని ఆర్.డి.ఓ సురేశ్ పాల్గొన్నారు.
ప్రారంభంలో ప్రాజెక్ట్ వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు తెలియజేశారు.
వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ఎన్.జి.ఓ.లు, పర్యావరణ ప్రేమికులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోవడం జరిగింది.
చివరిగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతిపాదనలకు తగిన చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ, సహకారాలు అందించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్ ,పోలీస్ శాఖ , సమీప గ్రామాల సర్పంచ్ లకు, ప్రజా ప్రతినిధులకు, కార్మిక సంఘాల నాయకులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, రామగుండం -1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్, రామగుండం-2 ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య, ఎన్విరాన్మెంట్ జనరల్ మేనేజర్ బి.సైదులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్ ప్రసాద్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, తోపాటు ఇతర కార్పోరేట్ పర్యావరణ అధికారులు, అధికారులు, సమీప గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు, పాల్గొన్నారు.