చర్చ, కమాన్ పూర్: మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
కమాన్‌పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్ర గౌడ్, కమాన్‌పూర్ నూతన సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ లు హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కమాన్‌పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్‌ను మంత్రి శ్రీధర్‌బాబు సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచిస్తూ నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.