News & Views

చర్చ , అంతర్గాం: అంతర్గాం సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించిన మైనార్టీ సోదరులు

 

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టి టి ఎస్ అంతర్గాం గ్రామంలోని జామా మసీద్ కమిటీ ముస్లిం సోదరులు నూతన సర్పంచ్ ఆంగోత్ రవి నాయక్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జామ మసీదు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు గెలవడం ఆనందకరమని, గ్రామ ప్రజల సమస్యల తో పాటు, ముస్లింలకు ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి కృషి చేస్తారని, ఆశిస్తున్నామని శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఆంగోతు రవి నాయక్, వార్డు సభ్యుడు మాడ అనిల్ రెడ్డి,కోలా సంతోష్ ను శాలువాలు కప్పి,పూల మాలతో సన్మానించినట్లు జామా మసీద్ ముస్లిం సభ్యులు తెలిపారు. మన గ్రామ సమస్యలు ఏమున్నా వెంటనే పరిష్కారం చేస్తానని, మైనార్టీ సోదరి, సోదరీమణులకు జామా మసీదుకు ఏ సమస్య ఉన్న తప్పకుండా పరిష్కారం చేస్తానని సర్పంచ్ రవి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.