News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇసుక ర్యాంపును ప్రారంభించిన తహసీల్దార్

ఇందుములముగా పాల్వంచ మండల ప్రజలకు తెలియచేయునది ఏమనగా, జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు అందుబాటులో ఇసుక ఇంటివద్దకు సరఫరా చేయుటకు ప్రతిష్టాత్మకముగా మన ఇసుక వాహనం మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇట్టి యాప్ నందు బుకింగ్ చేయుట ద్వారా ప్రజలకు ఇసుక వారి ఇంటి వద్దకే వస్తుంది. ఈరోజు దంతేలబోర SC కాలనీ గ్రామపంచాయితీ పరిదిలో ఇసుకర్యాంపు ను తహశిల్దారు శ్రీ దారా ప్రసాద్ ప్రారంబించి మండల ప్రజలు సద్వినియోగము చేసుకోవాలని తెలిపినారు అదేవిదముగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.