News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సిపిఐ లో చేరిన కోడిపుంజుల వాగు సర్పంచ్ మహేశ్వరి

పాల్వంచ : కోడిపుంజుల వాగు నూతన సర్పంచ్ అజ్మీర మహేశ్వరి శ్రీనివాస్ శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) లో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబ శివ రావు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సిపిఐ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కోడిపుంజుల వాగు సర్పంచ్ మహేశ్వరి సిపిఐ లో చేరారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామపంచాయతీ పాలన ముందుకు సాగాలని, రాగద్వేషాలకు తావు లేకుండా పారదర్శకతతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పేదల పక్షాన అనునిత్యం పోరాడే సిపిఐ కుటుంబం లోకి రావడం అభినందనీయం అనీ,
ప్రజల పక్షాన చేపట్టే ప్రతి మంచి కార్యక్రమం వెనుక సిపిఐ అండదండలు ఉంటాయని అన్నా రు.
మహేశ్వరి చేరికతో స్థానిక సంస్థల్లో మరింత బలం పెరిగిందని చెప్పారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీశం శెట్టి పూర్ణచంద్రరావు, గుండాల నాగరాజు. మన్యం వెంకన్న అజ్మీర రాములు నాయక్, అజ్మీర శ్రీనివాస నాయక్ బాదావత్ వెంకటరామ్, బాదా వత్ రాములు బాదా వత్ రాంజీ, గూగులోత్
రాములు, బాదావత్ లక్పతి, బానోత్ చందు అజ్మీరా బాలు, అజ్మీర కృష్ణ, తేజవత్ రమేష్. లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.