చర్చ,పెద్దపల్లి: ముత్తారం ఎంపిడిఓ జి.లలిత సస్పెన్షన్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కమాన్ పూర్ ఎంపీడీవో గా పని చేస్తున్న సమయంలో అవకతవకలు
ముత్తారం ఎంపిడిఓ, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీ లో ఏ.పీ.డీ గా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న జి.లలిత ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన ఎం.తిరుపతి అవినీతి కారణంగా సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. ఎం తిరుపతి విచారణ సమయంలో అప్పటి కమాన్ పూర్ ఎంపీడీఓ గా విధులు నిర్వహించిన జి.లలిత కు అవినీతి డబ్బులు వాటా పంపినట్లు మాజీ పంచాయతీ కార్యదర్శి ఎం.తిరుపతి వాంగ్మూలం, ఫోన్ పే స్క్రిన్ షాట్స్ సమర్పించారని కలెక్టర్ పేర్కొన్నారు.
పిడి హౌసింగ్ జే. రాజేశ్వర్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి రిపోర్ట్ అందించాల్సిందిగా ఆదేశించడం జరిగిందని, ఎం.తిరుపతి వాంగ్మూలం సంబంధించి జి లలిత ఎంపీడీవో పై చేసిన ఆరోపణలకు ఆధారాలు లభించాయని, పీడీ హౌసింగ్ చేపట్టిన విచారణకు ఎంపీడీవో జి లలిత నుంచి సహకారం లభించ లేదని రిపోర్ట్ సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
పిడి హౌసింగ్ అందించిన రిపోర్ట్ అందుబాటులో ఉన్న సాక్షాల పరిశీలన మేరకు ముత్తారం ఎంపిడిఓ, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీ లో ఏ.పీ.డీ గా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న జి.లలిత ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి, సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని కలెక్టర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.