News & Views

చర్చ,గొదావరిఖని: అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి.

రామగుండం కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.1992 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం కమీషనరేట్ లో విదులు నిర్వహిస్తున్నారు.అడిషనల్ డిసిపి అడ్మిన్ శ్రీనివాస్ గోదావరిఖని ఐబికాలనిలో ని రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీసు శాఖ తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలీసు శాఖ తరుపున అంతక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.
డీసీపీ అడ్మిన్ వెంట పీసీ ఆర్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్,రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చిప్ప రాజమౌళి గౌడ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం, సిబ్బంది పాల్గొన్నారు.