చర్చ, కరీంనగర్: ఘనంగా గణిత దినోత్సవం

ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్బంగా మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల బాయ్స్ -2 ఇరుకుల్ల లో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా 1729 ఆకారంలో విద్యార్థుల విన్యాసం ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన మాథ్స్ రోబో అలరించింది. గణిత శాస్త్రనికి సంబందించిన అంశాలతో ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ కనపర్తి సురేష్, స్కూల్ కో ఆర్డినేటర్ మహేందర్, ఉపాధ్యాయులు జలజ, పవన్, శ్రీలత, శ్రీనివాస్, శ్రవణ్, సతీష్, విష్ణు, తిరుమల, జ్యోతి, రాజు, జూవేరియా, వార్డెన్ ప్రకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.