News & Views

చర్చ; రామగిరి: ఆర్.జీ -3, ఏ.పి.ఏ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులు ఎంపిక

సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేయడం జరిగిందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రామగుండం-3 ఏరియా నుండి ఓ.సి-1ఇ.పి.ఆపరేటర్ కె.నారాయణ, ఓ.సి-2 ఇ.పి.ఆపరేటర్ పోలు శంకర్, ఎస్టేట్స్ విభాగం డిప్యూటీ ఎస్టేట్స్ మేనేజర్ కె.ఐలయ్య, ఓ.సి-1 సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.అశోక్ కుమార్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా నుండి ఫిట్టర్ జి.మహేష్, జనరల్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్, డిప్యూటి మేనేజర్ కటకం కమలాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీధర్,లు ఎంపిక కావడం జరిగిందని, వీరిని మంగళవారం జి.యం కార్యాలయ ఆవరణలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సన్మానించడం జరుగుతుందని వారు తెలిపారు.