చర్చ,అంతర్గాం: అను నేను సర్పంచిగా… కొలువు దీరిన కొత్త సర్పంచులు..
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్.

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో పలు గ్రామాలలో నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ హాజరై నూతన సర్పంచులు ,పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు వారి గ్రామాలలో అభివృద్ది కోసం కృషి చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ముంజూరు చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్, డిప్యూటీ తాసిల్దార్ మల్యాల తిరుపతి, అగ్రికల్చర్ ఏఓ కల్వల సతీష్ కుమార్, నూతన సర్పంచులు ఆంగోత్ రవి నాయక్, మగ్గిడి స్వరూప శ్రీనివాస్, గాదే స్రవంతి- సుధాకర్, గుంట బాపు, దార వేణి సాయికుమార్, దార వేణి జ్యోతి దార వేణి జ్యోతి- పరమేష్, వివిధ గ్రామాల సర్పంచులు,ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.