News & Views

చర్చ,రామగుండం: రామగుండం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి రాంరెడ్డి.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ ను సోమవారం పెద్దపల్లి డీసీపీ బి రామ్ రెడ్డి సందర్శించారు.
ఠాణా రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్లు, వాటి రికార్డులను తనిఖీ చేశారు. నమోదు చేసిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండర్ ఇన్వెస్టిగేషన్ లలో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ సంధ్యారాణి ని అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది వారు చేస్తున్న విధులు, పని తీరు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీ లు చేసే విధంగా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.
డిసిపి వెంట గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్,ఎస్ ఐ సంధ్య రాణి ఉన్నారు.