News & Views

చర్చ: పెద్దపల్లి: మేడారం సర్పంచ్ గా పదవి స్వీకరణ వీర్ పాల్ (బ్రహ్మి)

  • గ్రామ ప్రజలు ఘనంగా సన్మానం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామ నూతన సర్పంచ్ గా మేడారం వీర్ పాల్(బ్రహ్మి)ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది.ఈ సందర్బంగా వీర్ పాల్ మాట్లాడుతు నా మీద నమ్మకం తో నాన్ను గెలిపించిన ప్రజలకు నేను రుణపడి ఉంటానని గ్రామభివృద్దే లక్ష్యంగా, పనిచేస్తానని మండలం లోనే మొదటి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామ ప్రజలు నాకు సహకరించాలని మీ సహకారం తో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ మేడారం వీర్ పాల్ (బ్రహ్మి ) పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, వార్డుసభ్యులు,ప్రజప్రతినిధులు, ప్రభుత్వఅధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.