చర్చ, కరీంనగర్ : స్తంభంపల్లి బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలి- సీపీఎం డిమాండ్..
- నడి రోడ్డుపై బైఠాయించి నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం స్తంభంపల్లి గంజి వాగుపై చేపట్టిన బ్రిడ్జి పనులను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని చేస్తూ సీపీఎం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ చేసిన తప్పిదం వల్ల సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రభుత్వం మరియు స్థానిక రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల నిర్లక్ష్యానికి నిదర్శనమని పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజల కష్టాలను గమనించకుండా పనులను మధ్యలోనే వదిలేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఎం బోయిన్‌పల్లి మండల శాఖ హెచ్చరించింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, మండల నాయకులు కుడుకల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.