చర్చ,పెద్దపల్లి: లాప్రోస్కోపీక్ సర్జరీ ద్వారా గ్లాడ్ బ్లాడర్ స్టోన్ తొలగింపు
పెద్దపల్లి జిల్లాలోని వెన్నెంపల్లి గ్రామానికి చెందిన 29 సంవత్సరాల ఒక మహిళలకు గత కొంతకాలంగా కడుపులో కుడి వైపు తీవ్రమైన నొప్పితో గ్లాడ్ బ్లాడర్ లో
14 mm స్టోన్ తో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇదివరకు ఈమెకు 4 పెద్ద ఆపరేషన్లు జరిగాయి. దీని వల్ల చేయబోయే ఆపరేషన్ క్లిష్ట తరంగ ఉంటుంది.
సదరు పేషెంట్ కి ఈ రోజు అన్ని జాగ్రత్తలు తీసుకొని డా. అమర సింహా రెడ్డి, లాప్రోస్కోప్ సర్జన్ తో లాప్రోస్కోపిక్ కొలాసిస్టెక్టమీ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి సర్జరీ లో పాల్గొన్న వైద్యుల బృందం డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ విష్ణు చంద్రిక, డాక్టర్ స్వాతి మరియు డాక్టర్ భవాని లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి కావున ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోగలరని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.