చర్చ : సింగరేణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సింగరేణి కాలరీస్ బీసీ & ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో, గౌరవనీయులు శ్రీ ఎం. బలరాం నాయక్ గారు (మాజీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్) సన్మానం…
చర్చ : సింగరేణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
సింగరేణి కాలరీస్ బీసీ & ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో, గౌరవనీయులు శ్రీ ఎం. బలరాం నాయక్ గారు (మాజీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్) సింగరేణి సంస్థకు గత 7 సంవత్సరాలుగా అందించిన విశిష్ట సేవలను గుర్తించి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
సింగరేణి చరిత్రలో గత 100 సంవత్సరాలుగా బీసీలకు లేని గుర్తింపును మన అసోసియేషన్ వారి దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంలో, బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఆ హామీని కార్యరూపం దాల్చే విధంగా, సంస్థలో తొలిసారిగా చీఫ్ లైజన్ ఆఫీసర్‌ను నియమించడం, అలాగే అన్ని ఏరియాల్లో ఏరియా లైజన్ అధికారులను నియమించడం జరిగింది.
అదేవిధంగా, మన ఆరాధ్య దైవమైన శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని తొలిసారిగా అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏరియాల్లో ప్రత్యేక నిధులను విడుదల చేశారు. అంతేకాకుండా, మన అసోసియేషన్ సెంట్రల్ కమిటీకి సింగరేణి క్వార్టర్‌ను ఆఫీస్‌గా అలాట్ చేసి, ఆ క్వార్టర్‌కు అవసరమైన మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది.
మన అసోసియేషన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గౌరవ శ్రీ ఎం. బలరాం నాయక్ గారిని, అసోసియేషన్ తరపున చిరు సన్మానంతో గౌరవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమీర్ శెట్టి నాగేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెన్నం వెంకటేశ్వరరావు గారు, జనరల్ సెక్రటరీ శ్రీ నల్లపూరి రమేష్ గారు, చీఫ్ లైజన్ ఆఫీసర్ శ్రీ పి. హరి శంకర్ గారు, కార్పొరేట్ కమిటీ అడ్వైజర్ శ్రీ ఎడవల్లి యాదగిరి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ కె.వి. ప్రకాష్ గారు, ట్రెజరర్ శ్రీ కోల హరీష్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ ఎం. బలరాం నాయక్ ఐఆర్‌ఎస్ గారిని శాలువతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేట్ కమిటీ నాయకులు శ్రీ జి. వెంకట స్వామి గారు, శ్రీ విజయ్ చందర్ గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు, శ్రీ నరేష్ గారు, శ్రీ మోహన్ గారు, శ్రీ కొత్త శ్రీనివాస్ గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.