News & Views

చర్చ : చుంచుపల్లి , సర్వీస్ బిగిన్స్…

కష్ట సమయాల్లో మీకు అండగా ముందు నేనే ఉంటా - సర్పంచ్ బలరాం...

సర్వీస్ బిగిన్స్, కష్ట సమయాల్లో మీకు అండగా ముందు నేనే ఉంటా – సర్పంచ్ బలరాం

చర్చ, నందాతండ

చుంచుపల్లి మండలం నందాతండ గ్రామపంచాయతీ, అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న బడుగు మల్లయ్య సోమవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్ బలరాం వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ బలరాం మాట్లాడుతూ, “ ఆర్థిక సహాయమే కాకుండా, ఈ కష్ట సమయంలో మీకు అండగా ఒక కొడుకులా ఉంటాను. ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా నాకు చెప్పండి” అంటూ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 7 వార్డు నెంబర్ పద్దం శ్రీలత వైఫ్ అఫ్ భార్గవ్, 5 వార్డ్ మెంబర్ వీరన్న, మాజీ వార్డు మెంబర్ తుంపురు శివ, వాటర్ ప్లాంట్ నరేష్, ఫోటోగ్రాఫర్ బూరుగు రాజేష్ గాంధీ, కామ్రేడ్ బానోత్ సురేష్, గ్రామస్తుడు బడుగు నరసింహారావు పాల్గొన్నారు.