News & Views

చర్చ, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా…

    • త్వరలోనే నూతన కమిటీల నియామకం
    • కార్పొరేషన్ ను నాలుగు జోన్లుగా విభజన ..
    • ఒక్కో జోనుకు స్వాతంత్ర సమరయోధుని పేరుతో వినూత్న ఆలోచన
    • పదేళ్ల కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సమచిత స్థానం…
    • డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అన్ని డివిజన్ల లో పెద్ద ఎత్తున పథకావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
    • కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, వైద్యుల అంజన్ కుమార్

 

కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన నేడు డిసిసి కార్యాలయంలో కార్పొరేషన్ స్థాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకంలో భాగంగా కార్పొరేషన్ ప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించడంతో పాటు ఒక్కో జోనుకు ఒక స్వాతంత్ర సమరయోధుని పేరు పెట్టడం జరుగుతుందని, గతంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేసిన వారిని గుర్తించి వారిని కొనసాగించడం లేదా నూతన కమిటీలో స్థానం కల్పించే విషయంలో నూతన కమిటీలో భాగంగా ప్రతి 11 డివిజన్లకు ఒక కార్యదర్శి, ఒక ఉపాధ్యక్షుడిని నియమించడం జరుగుతుందని తెలిపారు. దీనిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకునే కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో నూతన జిల్లా కమిటీ నియామక ప్రక్రియలో జిల్లాకు పిసిసి ప్రతినిధులుగా నియమితులైన నమిండ్ల శ్రీనివాస్, గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు, కార్యకర్తలు అభద్రతాభావానికి లోను కావద్దని, నూతన కమిటీ విధివిధానాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. సమష్టి కృషితో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు తెలిపారు. వచ్చే డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైద్యుల అంజన్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.