News & Views

చర్చ: పెద్దపల్లి: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘటనలకు విశ్వహిందూ పరిషత్– బజరంగ్ దళ్ నిరసన

పెద్దపల్లి పట్టణంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఇటీవల దీపు చంద్ర హత్యను ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనల పిలుపులో భాగంగా జిహాదీల దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు మతోన్మాద చర్యలేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మతోన్మాదానికి మద్దతు ఇచ్చే ధోరణిని ఖండించాల్సిందిగా కోరారు. భారత్ సహ మత సమ్మేళన దేశమని, అన్ని మతాల మధ్య శాంతి, సామరస్యం కొనసాగాలని అన్నారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జిల్లా, నగర బాధ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.