News & Views

చర్చ : కార్తీక మాసంలో అన్నవరం, పంచారామాలకు సత్తుపల్లి నుండి ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు…

కరపత్రాలు విడుదల చేసిన MVI J.N. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ వి .సునీత గారు...

చర్చ : కార్తీక మాసంలో అన్నవరం, పంచారామాలకు సత్తుపల్లి నుండి ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు
కరపత్రాలు విడుదల చేసిన MVI J.N. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ వి .సునీత గారు.

కార్తీక మాసం సందర్భంగా సత్తుపల్లి డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం మరియు పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి. సునీత గారు తెలిపారు. శనివారం డిపో మేనేజర్ గారి కార్యాలయంలో స్థానిక ఎం వి ఐ శ్రీనివాస్ గారితో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు సత్తుపల్లి నుండి అన్నవరం , పంచారామాలకు డీలక్స్ బస్సు బయలుదేరి కార్తీక సోమవారం పుణ్యక్షేత్రాలకు చేరుకుంటుందని అన్నారు. అన్నవరం పెద్దలకు చార్జి 570 రూపాయలు, పిల్లలకు చార్జి 330 నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. (ఒకవైపు మాత్రమే). పంచారామాలకు పెద్దలకు చార్జి 1500 రూపాయలు ,పిల్లలకు చార్జి 770 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆమె వివరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 4న కూడా డీలక్స్ బస్సులు నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. 30 మంది భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు. ప్రయాణికులే దైవంగా భావించి ప్రయాణికుల సౌకర్యార్థం సత్తుపల్లి డిపో నుండి అన్నవరం, పంచారామాలు అయిన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు.సత్తుపల్లి డిపో పరిధిలోని భక్తులు ఈ సదా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో MVI శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ మేనేజర్ పి విజయ శ్రీ, మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ రాములు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.