చర్చ, భద్రాద్రి కొత్తగూడెం : డీసీసీ ప్రెసిడెంట్ దేవి ప్రసన్న ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం
- ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్ పెరుమాళ్
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్ పెరుమాళ్ అన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అమలు చేయలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తూ జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీలకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టిన గ్రామీణ ప్రాంత ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆయన రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. రానున్న మూడేళ్లలో ప్రజా సంక్షేమ కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోంది అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకుని కుట్రలు చేస్తున్నారని, రాజకీయ ప్రతీకారంతో బీజేపీ చేస్తున్న చర్యలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి గమనిస్తుందన్నారు. అధికార బిజెపి తన రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి, విచారణ సంస్థలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఇది రాజ్యాంగ పరిపాలనకు విరుద్ధమన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సారద్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు నాగా సీతారాములు, మోతుకూరి ధర్మరావు, గ్రంధాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆళ్ళ మురళి, తూము చౌదరి, కాంగ్రెస్ నాయకులు అర్జున్ రావు, రైల్వే బోర్డు సభ్యులు వై శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రామ్మూర్తి, గులాం మతిన్, మాజీ కౌన్సిలర్ తలుగు అనిల్, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.