News & Views

చర్చ: రామగిరి: ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని
రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకరరావు అన్నారు.
బుధవారం సెంటినరీ కాలనీలోని సేవా భవన్ నందు టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ, మొదలగు విభాగాలలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
విశిష్ట అతిథిగా శ్రీమతి వెంకటలక్ష్మి నాగేశ్వర రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసమే కాకుండా, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం సింగరేణి సేవా సమితి ఎన్నో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. కావున ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని, నైపుణ్యాన్ని సంపాదించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని అన్నారు. గతంలో శిక్షణ పొందిన చాలా మంది మహిళలు, ప్రస్తుతం స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డివై.పి.ఎం. వి.సునీల్ ప్రసాద్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పి.రాజేశం, సేవా కార్యదర్శి ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి బి.అరుణ, సేవా సభ్యులు, శిక్షకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.