చర్చ: రామగిరి: రత్నాపూర్ సర్పంచ్ ఉపసర్పంచ్ లకు రజక సంఘం సన్మానం
స్థానిక సంస్థల ఎలక్షన్లులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన రత్నాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పల్లె ప్రతిమ పివి రావు లను మరియు ఉప సర్పంచ్ శ్రీమతి బాద్రపు ప్రవల్లిక ప్రశాంత్ లను రామగిరి మండల రజక సంఘం అధ్యక్షులు దర్ముల రాజయ్య ఆధ్వర్యంలో రత్నాపూర్ రజక సంఘం ఘనంగా సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా పల్లె ప్రతిమా పివి రావు మాట్లాడుతూ దాదాపు ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు నన్ను మీ ఇంటి సోదరిగా చూసుకుంటూ గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలోని సమస్యలన్ని పరిష్కరిస్తూ మీ సామాజిక వర్గాన్ని కూడా ఎటువంటి అవసరం వచ్చిన ముందుండి అవసరాన్ని తీరుస్తానని హామీ ఇచ్చినారు అధేవిధంగా రజక సంఘం సభ్యులు మీరు ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న మిమ్మల్ని మూడు దఫాలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా రజక సంఘం సమన్వయకర్త నాగేల్లి సాంబయ్య మరియు
రత్నపూర్ రజక సంఘం ప్రెసీడెంట్ ధర్ముల సంజీవ్ కుమార్ సంఘం సభ్యులు బండి ఆనంద్,సోమరపు కనకయ్య, ధర్ముల భూమయ్య ధర్ముల సదయ్య,ధర్ముల తిరుపతి, రేగల్ల కుమార్, భూతుకూరి తదితరులు పాల్గొన్నారు.