News & Views

చర్చ, రామ గిరి: ఉద్యోగ విరమణ పొందనున్న జి.ఎం దంపతులకు ఆత్మీయ సన్మానం

బుధవారం స్థానిక సేవా భవన్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్న రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకర రావు లను సేవా కార్యదర్శి ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి బి.అరుణ, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి వెంకటలక్ష్మి నాగేశ్వరరావు, పర్సనల్ విభాగధిపతి బి.సుదర్శనం, డివై పిఎం వి.సునీల్ ప్రసాద్, సీనియర్ పిఓ రాజేశం, సేవా సభ్యులు మల్లేశ్వరి, సుజాత, రాణి, స్వర్ణ లత, సుధ, అశ్విని, అస్మా తోపాటు ఇతర సభ్యులు, పాల్గొన్నారు.