News & Views

చర్చ, కరీంనగర్: రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు ఎంపీ ఈటెల

కరీంనగర్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు 80 ఏళ్ల వయసులో కూడా యువకులుగా ఉన్నారని చమత్కరించారు. ఈ సందర్భంగా 95 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ క్రీడలు నిర్వహిస్తే అక్కడ హాజరవుతున్న నల్లగొండకు చెందిన నిరంజన్ రెడ్డిని ఈటల రాజేందర్ సన్మానించారు. ఆటలు లేకపోవడం వల్ల పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. మనదేశంలో మానవ సంపదకు, విద్యకు కొదువలేదు కానీ యువత ఆరోగ్యవంతంగా లేదని గమనించి ప్రధాని నరేంద్ర మోదీ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఖేలో ఇండియా పేరుతో స్కూల్స్ లో మాత్రమే కాకుండా.. ప్రతి పార్లమెంట్ సభ్యుడు వారి నియోజకవర్గాల్లో క్రీడాకారులను కలవాలని, అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించాలని ఆదేశించారు అంటే ప్రధానమంత్రి మోడీ క్రీడలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అర్థం చేసుకోవచ్చని అన్నారు. మోడీ పిలుపు మేరకు కోట్ల మంది ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు.

ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ ప్రపంచ క్రీడలలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధిస్తుందని, ఇంకా ఎక్కువ పథకాలు సాధించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

నా పక్కన ఉన్న లక్ష్మారెడ్డికి 81 సంవత్సరాలు ప్రతిరోజు గ్రౌండ్లో ఉంటారు. ఆయనే మనకు ఆదర్శనం. వారి స్ఫూర్తిని అందుకొచ్చుకోవాలని అన్నారు. కేవలం సెల్ఫోన్, కంప్యూటర్లలోనే మునిగి తేలకుండా పిల్లలను ఆటలు ఆడించాలని, మానసిక ఉల్లాసానికి, మానవ సంబంధాలకు కనెక్టివిటీ ఈ క్రీడలని పేర్కొన్నారు. ఆరోగ్యం లేకపోతే అన్నీ వ్యర్థమని, పిల్లలు చెడు అలవాట్లకు పోకుండా ఉండాలంటే క్రీడల మీద దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు పిల్లలను నిర్వీర్యం చేస్తున్నాయని, వీటిని అంతం చేయడానికి నషా ముక్త్ భారత్ అంటూ నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. చెడు అలవాట్లను అంతం చేయగలిగిన శక్తి క్రీడలకు ఉందని, మానవ సంబంధాలను పరిపుష్టి చేసే సత్తా కూడా క్రీడలకు ఉందని, అందుకే గ్లక్రీడలను ప్రోత్సహించాలని,
క్రీడల పోటీలకు మా సహకారం కూడ ఉంటుందని తెలిపారు.