News & Views

చర్చ, హైదరాబాద్: ముదిరాజ్ సర్పంచుల సన్మాన సభను విజయవంతం చేయండి!

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

సికింద్రాబాద్ ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. డిసెంబర్ 30 వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ముదిరాజ్ సర్పంచుల సన్మాన కార్యక్రమంను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ముదిరాజ్ సమాజం మొత్తం సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సన్మాన సభ ముదిరాజ్ సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ముదిరాజ్ సర్పంచ్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.

సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా వ్యక్తిగతంగా ఫోన్ కాల్ లేదా ఆహ్వానం అందకపోయినా, ఈ ప్రకటనను అధికారిక ఆహ్వానంగా భావించి కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన అన్నారు. అదేవిధంగా, ప్రతి ముదిరాజ్ కులస్తుడు ఈ వేడుకను తమ స్వగృహ కార్యక్రమంగా భావించి పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామ స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో సేవలందిస్తున్న ముదిరాజ్ సర్పంచుల సేవలను గుర్తించి గౌరవించేందుకు ఈ సన్మాన సభ ఒక చారిత్రక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.