News & Views

చర్చ, రామగిరి: బేగంపేటలో జాతీయ రహదారి కిందగా వెళ్లే మార్గం పనులకు బ్రేక్ నిర్మాణ ప్రమాణాలు పాటించడం లేదని అడ్డుకున్న గ్రామస్తులు

బేగంపేట గ్రామ పరిధిలో జాతీయ రహదారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన కింద మార్గాలను (అండర్‌పాస్‌లను) తక్కువ ఎత్తు, తక్కువ పొడుగుతో రహదారి పనులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు కలిసి పనులను అడ్డుకున్నారు.
కిందగా వెళ్లే మార్గాలను ఈ విధంగా నిర్మితమైతే భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి, భవిష్యత్తులో వాహనదారులకు, పాదచారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రతినిధులు గ్రామ ప్రజలతో కలిసి నిర్మాణ స్థలానికి చేరుకుని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న అధికారులతో వాదనలు జరిపారు.
ప్రజల భద్రత, రవాణా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అండర్‌పాస్‌లను ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తు, పొడుగు పెంచి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రమాణాల ప్రకారం కొత్త డిజైన్ సిద్ధం చేసి, గ్రామ ప్రజల సమ్మతితోనే పనులు కొనసాగించాలని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంతెన చంటి ఉప సర్పంచ్ సందెల రేణుక కుమార్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.