News & Views

చర్చ , మంగపేట: గుత్తి కోయిలకు సహాయం చేసిన పోలీసు అధికారులు

  • చలి నుండి రక్షణ పొందేందుకు దుప్పట్లు సెటర్ల పంపిణీ చేసిన మంగపేట ఎస్సై టివిఆర్ సూరి

మంగపేట పోలీస్ ఆధ్వర్యంలో రాబిన్ హూడ్ వారి సహాయంతో ప్రాజెక్ట్ నగర్ గుత్తి కోయలు నివసిస్తున్న ప్రాంతంలో చలికాలం లో పడిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో వారికి సహాయార్థం మొత్తం 22 కుటుంబాలకి రగ్గులు సోలార్ లైట్లు నిత్యవసరాలు పౌష్టికాహారం బిస్కెట్, ఫ్రూట్స్ అందజేయడం జరిగిందని మంగపేట స్థానిక ఎస్ఐ పీవీఆర్ సూరి తెలిపారు.
గిరిజనులు అడవుల్లో జీవిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి చేదోడువాదోడుగా పోలీసు వారు ఎల్లప్పుడూ ఉంటారని మనోధైర్యాన్ని కల్పించారు. స్థానిక ఎస్పీ వారి పట్ల సానుకూలత గా ఉన్నారని వారి జీవన విధానాన్ని వారి ఔన్నత్యాన్ని కోరుకుంటూ వారికి సహాయార్థంగా దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంగపేట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.