చర్చ, రామగిరి: నూతన సర్పంచును సన్మానించిన సుందరం ఫౌండేషన్ సభ్యులు.
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పల్లె ప్రతిమ పీవీరావును ఆదివారం కమాన్ పూర్ మండలానికి చెందిన సుందరం ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కమాన్ పూర్ మాజీ ఎంపీటీసీ, సుందరం ఫౌండేషన్ ఫౌండర్ బోనాల వెంకట స్వామి పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపీటీసీగా, సర్పంచ్ గా
మరోసారి సర్పంచ్ గా గెలవడం ప్రజలలో వారికి ఉన్న పట్టుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చిప్పకుర్తి అరవింద్, చెన్నోజు చంద్రశేఖర్, దండే తిరుపతి, కుక్క వరప్రసాద్ పాల్గొన్నారు.