News & Views

చర్చ, కరీంనగర్: కరీంనగర్ లో ఘనంగా జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవ దినోత్సవం

  • కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందని ప్రతి పౌరుడు విశ్వసిస్తున్నారు.
  • స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కాంగ్రెస్ – చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆవిర్భావా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేకును మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణుల సమక్షంలో కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.

1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నేటికి 141 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ఏర్పడిన జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఆ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. స్వాతంత్రం సిద్ధించిన సమయంలో దేశంలో చాలా గ్రామాలలో కనీసం కరెంటు లేని పరిస్థితి, ఒక గుండు సూది తయారు చేయలేని పరిస్థితులున్నాయని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి దేశంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గొప్ప దార్శనికతతో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపించి, ఆహార భద్రతకు సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు జరగడం ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్థాపించడం కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అయ్యిందనీ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని విచ్చిన్నం చేయడానికి అనేక మతతత్వ శక్తులు, ప్రాంతీయ శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా 141 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని వారి గుండెల్లో నిలిచిపోయిందని తెలిపారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, పత్తి మధుకర్ రెడ్డి, మడుపు మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, మల్యాల సుజిత్ కుమార్, చర్ల పద్మ, వెన్నం రజిత రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.