చర్చ, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
- నగరంలో ఘనంగా జెండా పండుగ
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నగరంలో పలు డివిజన్లలో పార్టీ జెండాలు ఆవిష్కరించి, కార్యాలయాలను ప్రారంభించారు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్.
నగరంలోని 64వ డివిజన్ లో స్థానిక నాయకుడైన అహమ్మద్ అలీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని అంజన్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ1885లో ఏ.వో. హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నేటికీ 141 సంవత్సరాలలోకి అడుగు పెట్టిందని, అందుకే నగరంలో పలు డివిజన్లలో పార్టీ జెండాలు ఆవిష్కరించామని అన్నారు. 64వ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటానికి అహమ్మద్ అలీ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ కార్యాలయం పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ ఏ మోసిన్, నిహాల్,షాకీర్, అజీమ్, వసీం, ఖలీద్, ఇమ్రాన్, జమీల్, అజ్జు, అక్బర్, మున్నార్,అనాజ్, ఖాన్ తదితరులు పాల్గొన్నారు.