News & Views

చర్చ, కరీంనగర్: 45వ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

సుడా చైర్మన్ కు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ వినతి

కరీంనగర్ నగరంలోని 45వ డివిజన్‌ (పార్ట్ 36, 14వ డివిజన్) పరిధిలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ వినతి పత్రం అందజేశారు. డివిజన్‌లో రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. డివిజన్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వీధిదీపాలు పనిచేయక రాత్రి వేళల్లో భయానక వాతావరణం నెలకొంటోందని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల లేమి ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని మహమ్మద్ అజీమ్ నరేందర్ రెడ్డికి వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంగా 45వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అజీమ్ వినతిపై నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ తెలిపారు.