News & Views

చర్చ:రామగిరి : రాష్ట్రస్థాయి లో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రాధ

 

మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం, కరీంనగర్ నందు నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలలో 50+ మహిళ విభాగం 200మీటర్లు,400 మీటర్ల పరుగు పోటీలో పెద్దపల్లి జిల్లా నుండి పాల్గొన్న జీడీకే 8వ కాలనీకి చెందిన కాంటేవాడ రాధ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. సింగరేణి ఆర్జీ3 ఓసీ1 గని ఉద్యోగి కాంటేవాడ బుగ్గాజీ భార్య రాధ గత 3సంవత్సరాలుగా అథ్లేటిక్ గా రాణిస్తున్నారు. ఈ ఈవెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన రాధకు మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గజవెల్లి పురుషోత్తం, కల్లెం మహేందర్ రెడ్డి అభినందనలు తెలుపుతూ జనవరి 30 నుండి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లోని పటేల్ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాల్గొంటుందని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రాధకు బంగారు పతకాలు, ప్రశంసపత్రాలను తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి ఆర్.ప్రభుకుమార్, డి. లక్ష్మీ సమక్షంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోషియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చాట్ల అందజేశారు. ఒక గృహిణిగా ఉంటూ, జాతీయస్థాయి అథ్లెటిక్ గా రాణిస్తున్నందుకు రాధకు, ఆమెను ప్రోత్సహించి, మంచి తర్పీధునిచ్చే తన గురువుగా ఉన్న తన భర్త బుగ్గాజీలకు పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.