చర్చ, జగిత్యాల: యావరు రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ లో చర్చించిన ఎమ్మెల్యే సంజయ్ _
జగిత్యాల మున్సిపల్ అతి పురాతన మున్సిపాలిటని
యావర్ రోడ్డు ను 60 ఫీట్ ల నుండి 100 ఫీట్ లకు విస్తరణ చేయటం జరిగిందని,
2021 లో 100 ఫీట్ లకు యావర్ రోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్ లో జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ లో ప్రస్థావించారు. ప్రస్తుతం
ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ను చేపట్టి ఉన్న నేపథ్యంలో యావర్ రోడ్డు విస్తరణ అతి త్వరలో చేయాలని సభ అధ్యక్షులు ద్వారా ఎమ్మెల్యే కోరారు. అలాగే జగిత్యాల ఇరిగేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా ప్రాంతం కాబట్టి రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా కాలువల మరమ్మతులు చేపట్టాలని సభలో కోరారు.
జగిత్యాల జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహించే ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించి రోల్లవాగు ప్రాజెక్ట్ అటవీ అనుమతులు రాక గేట్ల బిగింపు ఆలస్యం జరుగుతోందని ముఖ్యమంత్రి ,ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సభాధ్యాక్షుల ద్వారా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు.