చర్చ: రామగిరి: విశ్రాంత సింగరేణియిల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం
- భారీగా హాజరైన విశ్రాంత కార్మికులు.
ఆల్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత సింగరేణి కార్మికుల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విశ్రాంత కార్మికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎంపీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ హాజరై మాట్లాడారు. విశ్రాంత కార్మికులు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆయన పేర్కొన్నారు. విశ్రాంతి అనంతరం కూడా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై సంఘం ద్వారా పోరాటం కొనసాగాలని సూచించారు.
కార్యక్రమంలో సంఘ నాయకులు మాట్లాడుతూ, పెన్షన్, సీఎంపీఎఫ్, ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలపై ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశం ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.