News & Views

చర్చ:పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి… అదనపు కలెక్టర్ డి.వేణు

  • ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

పెద్దపల్లి పట్టణం 25వ వార్డు ఉదయ నగర్ కు చెందిన ఎన్. జ్యోతి తనకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఎన్. కాంతమ్మ రాజయ్య దంపతులు తమ పెద్ద కుమారుడు, కొడెలు 20 సంవత్సరాల నుంచి బాగోగులు చూడడం లేదని, పోలీస్ స్టేషన్ నందు తప్పుడు కేసులు పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

పాలకుర్తి మండలం రామారావు పల్లె గ్రామానికి చెందిన మల్లమ్మ ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, పునాది వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నామని, 3 నెలలు గడిచిన బిల్లులు మంజూరు కావడం లేదని, తమ బిల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ అధికారకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు

ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.