చర్చ, జగిత్యాల: కొత్త సంవత్సరం సంతోషంగా సాగాలి
- నిర్లక్ష్యం తో విషాదంగా మారోద్దు
- జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
- వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించం.*
- జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్త్, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.
- జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకొవాలని, నిర్లక్ష్యం మూలంగా విషాద సంఘటనలకు తావివ్వొద్దని, కొత్త ఏడాది మొత్తం సంతోషం గా సాగేలా ఏడాది మొదలునే జరుపుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరారు. 31 డిసెంబర్ ను పురస్కరించుకొని మీడియా తో ఎస్పీ మాట్లాడారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పక్కా కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపడుతొందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇండ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం ఆనందంగా ప్రారంభం కావాలి గానీ, నిర్లక్ష్యం వల్ల విషాదంగా మారకూడదు” అని ఎస్పీ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 ని పురస్కరించుకొని ఎస్పీ పలు సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలుంటాయాన్నారు.
మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలని, మైనర్లకు మద్యం అమ్మరాదన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు.
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ అంక్షలను ఎవరైన అతిక్రమించినా, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ కు జిల్లా ప్రజల సహకరించాలని ఎస్పీ కోరారు. 2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ అశోక్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.